Telugu Global
Cinema & Entertainment

Mam Mascheedndra - మరో ముగ్గురు వస్తున్నారు!

Mam Mascheedndra teaser - సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర టీజర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం

Mam Mascheedndra - మరో ముగ్గురు వస్తున్నారు!
X

సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ 'మామా మశ్చీంద్ర'. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్ డాన్, డిజె .. ఇలా మూడు భిన్నమైన పాత్రలు పోషించాడు సుధీర్ బాబు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశాడు. టీజర్‌లో సుధీర్‌బాబు మూడు పాత్రలు, వాటి క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేసేలా ఉంది. దుర్గ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్ కావాలని తపిస్తుంటాడు, డిజే ఏవో కారణాల వలన అమ్మాయిలను వద్దనుకుంటాడు. పరశురామ్ ఈ ఇద్దరిని చంపాలనుకునే డాన్. టీజర్ వినోదాత్మకంగా ఉంది.

సుధీర్ బాబు మూడు పాత్రల మధ్య వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించాడు. డీజేగా తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెబుతూ అలరించాడు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా గ్లామరస్ గా కనిపించారు. హర్షవర్ధన్ యూనిక్ కథతో పాత్రలను ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు.

పిజి విందా సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తారు.

First Published:  23 April 2023 9:36 AM GMT
Next Story