Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu: హంట్ మూవీ వచ్చేస్తోంది.

Sudheer Babu: సుధీర్ బాబు తాజా చిత్రం HUNT. ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేశారు. రిపబ్లిక్ డే రోజున వస్తోంది.

Sudheer Babu: హంట్ మూవీ వచ్చేస్తోంది.
X

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాత ప్రకటించారు.

'హంట్' విడుదల తేదీని వెల్లడిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుధీర్ లుక్, కళ్ళలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. సినిమా రెడీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు..

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్.

ఈ సినిమాలో హీరోయిన్ లేదు. అందుకే అప్సర రాణిని పెట్టి ఓ ఐటెంసాంగ్ చేశారు. ఆ పాట కూడా రిలీజైంది.

First Published:  31 Dec 2022 3:28 PM GMT
Next Story