Telugu Global
Cinema & Entertainment

Harom Hara | సుధీర్ బాబు సినిమా షూటింగ్ అప్ డేట్స్

Harom Hara Movie - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోంహర. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ పూర్తి చేశాడు హీరో.

Harom Hara | సుధీర్ బాబు సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి సినిమా ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన ‘హరోం హర' ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా చిత్ర యూనిట్ ఉడిపిలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షెడ్యూల్‌ అనంతరం హీరో సుధీర్ బాబు శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయాన్ని దర్శించుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రీసెంట్ గా సరైన సక్సెస్ దక్కించుకోలేకపోయాడు సుధీర్ బాబు. హంట్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శ్రీదేవి సోడాసెంటర్ లాంటి సినిమాలు ఫెయిల్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ హీరో చేతిలో మామా మశ్చీంద్ర, హరోంహర సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ అవుతాయనే నమ్మకంతో ఉన్నాడు సుధీర్ బాబు.

First Published:  21 July 2023 10:54 AM GMT
Next Story