Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu - హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్ వచ్చేసింది

Sudheer Babu's Harom Hara - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. దీనికి ఫస్ట్ ట్రిగ్గర్ అనే పేరు పెట్టారు.

Sudheer Babu - హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్ వచ్చేసింది
X

సుధీర్ బాబు పాన్ ఇండియాచిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈరోజు సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోను విడుదల చేశారు.

రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తాడు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు... కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది... ఇది నాకేదో సెప్తావుంది...” అని సుధీర్ బాబు చిత్తూరు యాసలో అదరగొట్టాడు.

సుధీర్ బాబు మాండలికం బాగుంది. సుధీర్ బాబు ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తాజాగా రిలీజైన ఫస్ట్ ట్రిగ్గర్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హరోం హర కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుంది. గ్లింప్స్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న హరోంహర థియేటర్లలోకి రానుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.



Next Story