Telugu Global
Cinema & Entertainment

Harom Hara | సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్

Sudheer Babu - సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర. ఈ సినిమా నుంచి దసరా కానుకగా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Harom Hara | సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
X

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబుకు ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక శూలం పట్టుకుని, పసుపు దీక్షా దుస్తులలో సుధీర్ బాబు గుడి ముందు ఉన్న రాతిపై కూర్చున్నారు, అతని వెనుక గ్రామస్తులు ఉన్నారు. శరీరమంతా గాయాలయ్యాయి. సుధీర్ బాబు పోస్టర్‌లో ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌తో పాటు చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు మేకర్స్. టీజర్ దీపావళికి విడుదల కానుంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నాడు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  24 Oct 2023 4:59 PM GMT
Next Story