Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu | తన లోపాలు బయటపెట్టిన హీరో

Sudheer Babu - తన బలహీనతల్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నానని కూడా తెలిపాడు.

Sudheer Babu | తన లోపాలు బయటపెట్టిన హీరో
X

సాధారణంగా హీరోలు తమ గురించి గొప్పగా చెప్పుకుంటారు, తమ సినిమాల గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. కానీ తమ లోపాల్ని మాత్రం బయటపెట్టడానికి ఇష్టపడరు. జనాలు వాటి గురించి చర్చించుకుంటున్నా, తాము మాత్రం ఆ సబ్జెక్ట్ కవర్ చేయరు.

హీరో సుధీర్ బాబు మాత్రం ఇలాంటి వాటికి అతీతంగా ఉంటాడు. ఇగోలకు పోకుండా, సాధారణంగా ఉండే ఈ హీరో, తన లోపాలేంటో తనే స్వయంగా బయటపెట్టాడు. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించాడు.

"నేను నలుగురితో కలిసి మాట్లాడలేను. ఎప్పుడూ ఓ కార్నర్ లో కూర్చొని, జనాల్ని గమనించడం మాత్రమే ఇష్టం. నాకు నేనుగా పరిచయం పెంచుకొని, చర్చ మొదలుపెట్టలేను. ఎదుటి వ్యక్తిని నవ్వించలేను. ఇక సోషల్ మీడియాలో నేను చాలా బ్యాడ్. నాపై వచ్చిన అంశాలకు కూడా రెస్పాండ్ అవ్వాలనిపించదు. ఫొటోలంటే అసహ్యం. చిన్నప్పట్నుంచి నా ఫ్యామిలీ ఫొటోలు చూస్తే, ఓ రెండింటిలో మాత్రమే నేను కనిపిస్తాను. ఆ ఫొటోల్లో నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కానీ నేను మాత్రం కనిపించను."

ఇలా తన బలహీనతల్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. ఇప్పుడిప్పుడే కాస్త ఓపెన్ అయి, జనాలతో మాట్లాడుతున్నానని తెలిపిన ఈ నటుడు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపాడు. అయితే సోషల్ మీడియాను తను కేవలం సినిమాల కోసం మాత్రమే వాడతానని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. హర్షవర్థన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై సుధీర్ బాబు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అతడి కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం.

First Published:  3 Oct 2023 5:40 PM GMT
Next Story