Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu | హరోంహర సినిమాపై కోటిఆశలు

Sudheer Babu - సుధీర్ బాబు కొత్త సినిమా హరోంహర. ఈ సినిమాపై సుధీర్ బాబు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అదే విషయం చెబుతున్నాడు కూడా.

Sudheer Babu | హరోంహర సినిమాపై కోటిఆశలు
X

ప్రతి సినిమాపై హీరోలు నమ్మకంగా ఉంటారు. అయితే కొన్ని సినిమాలపై మాత్రం చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. ప్రస్తుతం సుధీర్ బాబు అలాంటి నమ్మకంతోనే ఉన్నాడు. అతడు చేస్తున్న తాజా చిత్రం హరోంహర. ఈ సినిమా తన కెరీర్ కు గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నాడు సుధీర్.

" దర్శకుడు సాగర్ నా కోసమే ఈ కథ రాసుకున్నాడు. తనకి అన్ని క్రాఫ్ట్స్ పై మంచి అవగాహన ఉంది. నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. టీజర్ చూసిన తర్వాత సుధీర్ బాబు లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ క్రెడిట్ సాగర్ కి దక్కుతుంది. తను ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందుకే టీజర్ అంత అద్భుతంగా వచ్చింది. నాకు 'హరోం హర' ఇచ్చిన సాగర్ కి థాంక్స్. దాదాపు 90శాతం సెట్స్ లోనే చేశాం. కొందరు సెట్స్ చూసి సలార్ సినిమా జరుగుతుందా అని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేశారు. ప్రొడక్షన్, డైరెక్షన్ టీం ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒకొక్క రోజు వెయ్యి మంది కూడా సెట్స్ లో ఉండేవారు. మంచి ఎమోషన్స్, చాలా హైస్ తో కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్రని పోషించాను. హరోం హర బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాన్ని సాధిస్తుంది. నా కెరీర్ లో గేమ్ చెంజర్ అవుతుందనే నమ్మకం వుంది."

ఇలా సినిమాపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాడు సుధీర్ బాబు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సుధీర్ బాబుకు ప్రాజెక్టుపై మరింత నమ్మకం పెరిగింది. ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడాడు సుధీర్ బాబు.

ఇంతకుముందు మామా మశ్చీంద్ర అనే సినిమా చేశాడు సుధీర్ బాబు. కెరీర్ లో తొలిసారి ట్రిపుల్ రోల్ చేసిన ఆ సినిమాపై అతడు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు హరోంహరపై ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో.

First Published:  5 Dec 2023 2:56 PM GMT
Next Story