Telugu Global
Cinema & Entertainment

Mama Mascheendra - సుధీర్ బాబు నుంచి మరో గెటప్

Sudheer babu Mama Mascheendra - మామా మశ్చీంద్ర సినిమా నుంచి ఇప్పటికే ఓ లుక్ రిలీజైంది. తాజాగా రెండో లుక్ విడుదల చేశారు.

Mama Mascheendra - సుధీర్ బాబు నుంచి మరో గెటప్
X

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, హర్షవర్ధన్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఇందులో మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు సుధీర్ బాబు.

ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్‌ రిలీజైంది. తాజాగా పరశురామ్ అనే క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు. చేతిలో తుపాకీ పట్టుకొని, వయసు ముదిరిన గ్యాంగ్‌స్టర్‌ లా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. ఆయన డ్రెస్సింగ్, సిట్టింగ్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ ఆకట్టుకున్నాయి. ఇక మూడో గెటప్, డీజే లుక్ ను 7న విడుదల చేస్తారు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ పై సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. పిజి విందా సినిమాటోగ్రఫర్.

ఈ సినిమాకు ఇంకా విడుదల తేదీని ఫిక్స్ చేయలేదు. సమ్మర్ తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. మామా మశ్చీంద్ర డిజిటల్ రైట్స్ ను ఆహా సంస్థ దక్కించుకుంది.

First Published:  5 March 2023 7:13 AM GMT
Next Story