Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu - 150 కిలోల మామా మశ్చీంద్ర

Sudheer Babu Mama Mascheendra Movie - మామా మశ్చీంద్ర సినిమాలో 3 రకాల పాత్రలు పోషిస్తున్నాడు సుధీర్ బాబు. అందులో ఒక పాత్రను తాజాగా విడుదల చేశారు.

Sudheer Babu - 150 కిలోల మామా మశ్చీంద్ర
X

సుధీర్ బాబు హీరోగా, నటుడు-దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్ నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ చిత్రంలో హీరో ని 3 విభిన్న షేడ్స్ లో చూపించబోతున్నారు హర్షవర్ధన్. సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే అనే 3 పాత్రల్లో కనిపిస్తాడు. మేకర్స్ తాజాగా దుర్గ లుక్ విడుదల చేశారు.

పొడవాటి జుట్టు, గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర 150 కేజీల బరువుతో ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు.

నిత్యం ఫిట్ గా ఉండే సుధీర్ బాబు, ఇలా లావుగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్ర కూడా పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తోంది.

మామా మశ్చీంద్ర అనే టైటిల్ సుధీర్ బాబు పాత్రల్లోని షేడ్స్ ను సూచిస్తుంది. పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  2 March 2023 4:25 AM GMT
Next Story