Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu | ట్రిపుల్ రోల్ బాగా ఎట్రాక్ట్ చేసింది

Sudheer Babu's Mama Mascheendra | మామా మశ్చీంద్ర (Mama Mascheendra) అనే సినిమాను సుధీర్ బాబు చేయడానికి కారణాలేంటి? సుధీర్ బాబు (Sudheer Babu) మాటల్లోనే.

Sudheer Babu | ట్రిపుల్ రోల్ బాగా ఎట్రాక్ట్ చేసింది
X

Sudheer Babu | ట్రిపుల్ రోల్ బాగా ఎట్రాక్ట్ చేసింది

Sudheer Babu | నైట్రో స్టార్ సుధీర్ బాబు, సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ కమ్ నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో సుధీర్ బాబు మీడియాతో మాట్లాడాడు. సినిమాలో తనకు నచ్చిన ఎలిమెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

"ఇందులో నన్ను ఎక్సయిట్ చేసింది ట్రిపుల్ రోల్. కృష్ణమ్మ కలిపింది, భాగీ, భలే మంచి రోజు లాంటి చిత్రాలలో డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇలాంటి పాత్రలు కూడా చేయగలను అని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. మామ మశ్చీంద్ర లో ట్రిపుల్ రోల్ ని ఒక అవకాశంగా భావించాను. ఇందులో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ యాసలు ఉంటాయి. ఒక పాత్ర తెలంగాణ, మరొకటి ఉత్తరాంద్ర, ఇంకొ పాత్రకు రాయలసీమ యాస ఉంటుంది. ఈ మూడు యాసలు నావి కాదు. ఓల్డ్ పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాం. అది నా రెగ్యులర్ భాష. ప్రతి పాత్రకు వేరియేషన్ ఉంది. ఒక పాత్ర కోసం బరువు పెరిగాను. మరో పాత్రకు ప్రోస్తటిక్స్ వాడాం. యంగ్ గా కనిపించే పాత్ర కోసం డైట్ రొటీన్ పాటించాను. ఈ చిత్రం మెంటల్ గా ఫిజికల్ గా ఒక ఛాలెంజ్."

ఇలా సినిమా కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. ఈ సినిమా కోసం తను రిస్క్ చేయాలనుకున్నానని, కానీ మహేష్ బాబు అంగీకరించలేదని చెప్పుకొచ్చాడు.

"నిజానికి ఒక పాత్ర కోసం బరువు ని రియల్ గా పెంచాలని అనుకున్నాను. అయితే సడన్ గా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేష్ బాబు గారితో పాటు సన్నిహితులందరూ చెప్పారు. దీంతో ప్రోస్తటిక్ ని వాడాల్సి వచ్చింది. యంగ్ పర్సన్ కి వాడే ప్రోస్తటిక్ మెటిరియల్ చాలా స్టిఫ్ గా ఉంటుంది. దీంతో ముఖంపై ఎక్స్ ప్రెషన్స్ ని చూపించడంలో కొంత ఛాలెంజ్ ఎదురైంది.. ఇందులో మాత్రం చాలా మంచి వర్క్ చేశాం. ఆడియన్స్ కి ఎక్కడా కూడా ప్రోస్తటిక్ ఫీలింగ్ రాదు. చాలా సహజంగా కుదిరింది. ఈ విషయంలో చిన్న టెస్ట్ కూడా పెట్టుకున్నాను. మా అపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ‘ఫలానా వాడు వస్తున్నాడు లోపలకి రానివ్వొద్దని’ చెప్పాను. ప్రోస్తటిక్ గెటప్ లో నేను వెళ్ళినపు నన్ను రానివ్వలేదు. లైవ్ లో గుర్తుపట్టలేకపోయారు. సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకు ఈ అనుభూతి ఉంటుంది."

ఈషా రెబ్బా, మిర్నాలినీ రవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కోసం ఓ సీన్ అనుకున్నారట. అయితే ఆయన ఈ లోకాన్ని వీడారు. దీంతో సినిమా నుంచి ఆ సీన్ ను తీసేశామని అన్నాడు సుధీర్ బాబు.

First Published:  5 Oct 2023 2:40 AM GMT
Next Story