Telugu Global
Cinema & Entertainment

నాక్కొంచెం తిక్కుంది.. దానికి పైత్యం కూడా తోడైంది

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇందులో తన పాత్ర తీరుతెన్నుల్ని వివరించాడు ఈ నటుడు.

నాక్కొంచెం తిక్కుంది.. దానికి పైత్యం కూడా తోడైంది
X

నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటాడు హీరో పవన్ కల్యాణ్. ఇప్పుడీ డైలాగ్ ను కాస్త మార్చి చెబుతున్నాడు హీరో సుధీర్ బాబు. తన కొత్త సినిమాలో పోషించిన పాత్రకు కొంచెం తిక్క ఉంటుందని, అయితే దాంతో పాటు కొంత పైత్యం కూడా ఉంటుందని చెబుతున్నాడు.

"ఈ సినిమాలో నేను ఫిలిం డైరక్టర్ గా చేశాను. ప్రతి దర్శకుడికి ఓ టేస్ట్ ఉంటుంది. దాన్ని కొంతమంది తిక్క అని కూడా ఉంటారు. అలాంటి తిక్క, పైత్యం ఉన్న దర్శకుడి పాత్రను నేను పోషించాను. మైండ్ లో ఎంత పైత్యం ఉన్నప్పటికీ, మనసులో ఓ పర్పస్ ఉంటుంది. అలాంటి పాత్ర నాది."

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేశాడు సుధీర్ బాబు. ఆ సినిమాలో తన పాత్ర స్వభావం ఎలా ఉంటుందో బయటపెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి నిన్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. చాలామంది నటులు, దర్శకులు ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, తన పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. తనకు మరోసారి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా.

First Published:  14 Sep 2022 4:07 AM GMT
Next Story