Telugu Global
Cinema & Entertainment

Kantara: స్టార్ మా చేతికి కాంతార

Kantara Movie: కాంతార సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆ ఛానెల్ లో ప్రసారం కానుంది.

Kantara: స్టార్ మా చేతికి కాంతార
X

తెలుగులో అనూహ్య విజయాన్నందుకున్న కాంతార సినిమా త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరించనుంది. ఈ సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ప్రముఖ శాటిలైట్ ఛానెల్ స్టార్ మా, కాంతార హక్కుల్ని దక్కించుకుంది. ఈ డబ్బింగ్ సినిమా హక్కులు తెలుగులో 4 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి.

ఓ కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఈ స్థాయిలో రేటు పలకడం విశేషం. కేజీఎఫ్ తర్వాత శాటిలైట్ లో ఈ రేటు అందుకున్న కన్నడ డబ్బింగ్ సినిమా ఇదే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను చాలా రోజుల కిందటే అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారు. టోటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దక్కించుకుంది.

తెలుగు శాటిలైట్ రైట్స్ ను 7 కోట్ల రేషియోలో అమ్మాలని నిర్మాతలు భావించారు. కానీ అంత మొత్తం రాలేదు. చివరికి నాలుగున్నర కోట్లకు డీల్ లాక్ చేశారు. ఇది కూడా పెద్ద మొత్తమే.

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో రిషబ్ కు ఇదే తొలి భారీ విజయం. టాలీవుడ్ లో ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఆయన పెట్టిన పెట్టుబడికి దాదాపు ఐదింతల లాభం అందుకున్నట్టు టాక్.

First Published:  17 Nov 2022 2:30 AM GMT
Next Story