Telugu Global
Cinema & Entertainment

Roshan - మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు

Son Roshan Mohan lal - శ్రీకాంత్ కొడుకు రోషన్ మంచి అవకాశం దక్కించుకున్నాడు. త్వరలోనే మోహన్ లాల్ తో కలిసి నటించనున్నాడు.

Roshan - మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు
X

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. వృష‌భ చిత్రంలో మోహ‌న్ లాల్ త‌న‌యుడుగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా దీనికి సంబంధించి మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. శ్రీకాంత్ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోష‌న్ మేక.. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ కొడుకు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

2024లో భారీ బ‌డ్జెట్‌తో వృష‌భ తెర‌కెక్క‌నుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఇంటెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. భారీ తారాగ‌ణం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్ వండర్ అవుతుందని చెబుతున్నారు.

సినిమాలో అత్యంత కీలకమైన రోల్ కు రోషన్ ను ఎంపిక చేశారట. అతిథి పాత్రలా కాకుండా, ఫుల్ లెంగ్త్ ఉండే రోల్ ను రోషన్ చేయబోతున్నాడట. ఈ సినిమా అవకాశంపై రోషన్ స్పందించాడు.

‘‘మోహన్‌లాల్‌ వంటి గొప్ప న‌టుడితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌టం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. వృష‌భ చిత్రంలో నేను చేయ‌బోయే పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. డైరెక్ట‌ర్ నంద‌ అంచ‌నాల‌ను రీచ్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నాను. ఇంత భారీ చిత్రంలో న‌టించ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను’’

ఇలా వృషభలో ఎంటర్ అవ్వడంపై ఆనందం వ్యక్తం చేశాడు రోషన్. వృష‌భ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌పంచవ్యాప్తంగా 4500 స్క్రీన్స్‌లో మ‌ల‌యాళం, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తారు.

First Published:  14 July 2023 4:38 PM GMT
Next Story