Telugu Global
Cinema & Entertainment

Sridevi Shoban Babu OTT Release Date: ఓటీటీలోకి శ్రీదేవి శోభన్ బాబు

Sridevi Shoban Babu OTT Release Date: సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా శ్రీదేవి శోభన్ బాబు. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. డేట్ కూడా ఫిక్స్ అయింది.

Sridevi Shoban Babu OTT Release Date: ఓటీటీలోకి శ్రీదేవి శోభన్ బాబు
X

Sridevi Shoban Babu OTT Release Date: ఓటీటీలోకి శ్రీదేవి శోభన్ బాబు

టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా శ్రీదేవి శోభన్ బాబు. తమిళ్ లో 96, తెలుగులో జాను చిత్రాల్లో చిన్నప్పటి జాను పాత్ర పోషించిన గౌరి కిషన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. రోహిణి, నాగబాబు కీలక పాత్రల్లో నటించారు.

ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూతురు సుశ్మిత నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తొలి సినిమాగా ఇది తెరకెక్కింది. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఈ నెల 30 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

ఇలాంటి సినిమాలకు థియేటర్స్ లో కంటే ఓటిటి లోనే మంచి స్పందన ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. సో.. శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఓటీటీలో పెద్ద హిట్ అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది.

First Published:  16 March 2023 5:00 PM GMT
Next Story