Telugu Global
Cinema & Entertainment

Ustaad movie | ఉస్తాద్ మూవీ అప్ డేట్స్

Sri Simha's Ustaad movie - భాగ్ సాలేతో థియేటర్లలోకి వచ్చిన శ్రీసింహా, వెంటనే మరో సినిమా రెడీ చేశాడు. దీని పేరు ఉస్తాద్.

Ustaad movie | ఉస్తాద్ మూవీ అప్ డేట్స్
X

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు హీరో శ్రీసింహా కోడూరి. మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన భాగ్ సాలే నిరాశపరిచింది. ఇప్పుడు మరో సినిమా రెడీ చేశాడు. దీని పేరు ఉస్తాద్. ఆగ‌స్ట్ 12న ‘ఉస్తాద్‌’ రిలీజ్ అవుతోంది.

‘ఉస్తాద్’ మూవీలో కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌ కు, ఓ సాంగ్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌, ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ను అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇందులో శ్రీసింహ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించ‌బోతున్నాడు.

ఈ చిత్రంలో దర్శకుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌ కీలక పాత్ర పోషించాడు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  11 July 2023 3:45 AM GMT
Next Story