Telugu Global
Cinema & Entertainment

Ustaad Movie | ఉస్తాద్ మూవీ ట్రయిలర్ రివ్యూ

Sri Simha's Ustaad Movie Trailer - శ్రీసింహా తాజా చిత్రం ఉస్తాద్. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

Ustaad Movie | ఉస్తాద్ మూవీ ట్రయిలర్ రివ్యూ
X

‘మత్తువదలరా’ వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. కాన్సెప్టులు మంచివే సెలక్ట్ చేసుకుంటున్న ఈ హీరో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.

మొన్నటికిమొన్న భాగ్ సాలే సినిమాతో థియేటర్లలోకి వచ్చిన శ్రీసింహా, ఇప్పుడు ఉస్తాద్ మూవీ రెడీ చేశాడు. ఆగస్ట్‌లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

`ఉస్తాద్` ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే..సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడు సూర్య ఆకాశంలో ఎగ‌రాల‌ని క‌ల‌లుకంటాడు. ఆ క‌ల‌ల‌ను సాధిస్తాడు. ఆ యువ‌కుడి కో-పైల‌ట్ జోసెఫ్ డిసౌజా పాత్ర‌లో గౌత‌మ్ వాసుదేవ్ న‌టించాడు. సూర్య పాత్ర‌లో శ్రీసింహా కోడూరి న‌టిస్తే, త‌న ప్రేయ‌సి పాత్ర‌లో కావ్యా క‌ళ్యాణ్ రామ్ నటించింది.

త‌ను ప్రేమించిన అమ్మాయితో పాటు సూర్యకు త‌న ఉస్తాద్ బైక్ అంటే ఎంతో ఇష్టం. డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్ ట్రైల‌ర్‌లో సూర్య ప్ర‌పంచాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు. శ్రీసింహ, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, అనుహాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌ తదితరుల పాత్రల్ని ట్రయిలర్ లో చూపించారు.

శ్రీసింహ ఇందులో 3 డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించాడు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్‌ చేస్తుందని అంటోంది యూనిట్. ఈ చిత్రానికి అకీవా సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు శ్రీసింహా.

First Published:  27 July 2023 4:52 PM GMT
Next Story