Telugu Global
Cinema & Entertainment

ఈ సినిమా నా ఐదేళ్ల జీవితం

ఒకే ఒక జీవితం కోసం తన ఐదేళ్ల జీవితాన్ని వెచ్చించానని చెప్పుకొచ్చాడు దర్శకుడు శ్రీకార్తీక్. ఈ సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు.

ఈ సినిమా నా ఐదేళ్ల జీవితం
X

ఒకే ఒక జీవితం. రెండున్నర గంటల సినిమా ఇది. ఈ రెండున్నర గంటల సినిమా కోసం తను ఐదున్నరేళ్లు కష్టపడినట్టు చెప్పుకొచ్చాడు దర్శకుడు శ్రీకార్తీక్. తొలి సినిమాకే దర్శకుడిగా సక్సెస్ అందుకున్న శ్రీకార్తీక్.. ఒకే ఒక జీవితం జర్నీని వివరించాడు.

"కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... ఇలా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా ఉంది"

ఇలా తన తొలి సినిమా జర్నీని పంచుకున్నాడు శ్రీకార్తీక్. తను షార్ట్ ఫిలిమ్స్ తీసే టైమ్ కే తల్లిని కోల్పోయానని, అమ్మ ఉంటే నా సక్సెస్ చూసి చాలా ఆనందించేదని, ఆ ఆలోచన నుంచే ఒకే ఒక జీవితం కథ పుట్టికొచ్చిందని తెలిపాడు కార్తీక్.

ఈ కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచ్చు. అలా చెబితే మెలొడ్రామా ఎక్కువైపోతుందని, అందుకే సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ జోడించానని తెలిపాడు. తనకు సైన్స్ అంటే చాలా ఇష్టమని, అందుకే తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ ను, అమ్మను కలిపి కథగా మార్చానని వెల్లడించాడు.

First Published:  14 Sep 2022 3:56 AM GMT
Next Story