Telugu Global
Cinema & Entertainment

Sreenivas Bellamkonda - తెలుగులో బెల్లంకొండ కొత్త సినిమా

Sreenivas Bellamkonda - ప్రస్తుతం హిందీలో ఛత్రపతి చేస్తున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా షూట్ పూర్తవ్వడంతో తెలుగులో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు.

Sreenivas Bellamkonda - తెలుగులో బెల్లంకొండ కొత్త సినిమా
X

యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ డిఫరెంట్ జోన్ లో ఉన్నాడు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇది ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని తాజాగా ఎనౌన్స్ చేశారు.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ సినిమా చేయబోతున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం మరో డిఫరెంట్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

బెల్లంకొండ కెరీర్ లో పదో చిత్రం ఇది. మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రీ లుక్ పోస్టర్ లో పోలీస్ క్వార్టర్స్, జాతీయజెండా లాంటి ఎలిమెంట్స్ చూపించి, సినిమాపై అంచనాలు పెంచారు.

రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  31 March 2023 2:21 PM GMT
Next Story