Telugu Global
Cinema & Entertainment

SreeLeela - ఇంటర్నేషనల్ మూవీలో శ్రీలీల

Sreeleela international film - శ్రీలీల త్వరలోనే ఓ అంతర్జతీయ సినిమాలో కనిపించే అవకాశం ఉంది

SreeLeela - ఇంటర్నేషనల్ మూవీలో శ్రీలీల
X

వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. ఓవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే, మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా వదలడం లేదు ఈ బ్యూటీ. ఇందులో భాగంగా ఓ ఇంటర్నేషనల్ సినిమాలో శ్రీలీల నటించనుందనే టాక్ జోరుగా సాగుతోంది.

‘చెన్నై స్టోరీ’ అనే ఇంగ్లిష్ సినిమాలో శ్రీలీల నటించబోతోందట. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత పేరు బాగా వినిపించింది. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుంది.

ఈ ప్రాజెక్టులో శ్రీలలను తీసుకోవడం దాదాపు ఫిక్స్ అయింది. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ చెన్నైలో ఉంటుంది. ఆ తర్వాత కొంత భాగాన్ని లండన్ లో చిత్రీకరిస్తారు. ఈ సినిమాకు శ్రీలల అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ ఇంటర్నేషనల్ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

First Published:  29 May 2023 5:05 AM GMT
Next Story