Telugu Global
Cinema & Entertainment

SreeLeela | క్రేజీ ప్రాజెక్టు వదిలేసింది

SreeLeela - విజయ్ దేవరకొండతో సినిమాకు ఓకే చెప్పింది. ఓపెనింగ్ కు కూడా వెళ్లింది. ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది శ్రీలీల.

SreeLeela | క్రేజీ ప్రాజెక్టు వదిలేసింది
X

విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంది. కచ్చితంగా ఫ్యాన్స్ కు నచ్చే న్యూస్ కాదిది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇదే నిజం. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఓపెనింగ్ కు కూడా ఆమె హాజరైంది. ఇప్పుడీ సినిమా నుంచి తప్పుకుందామె.

100 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. ఇలాంటి సినిమాను శ్రీలీల వదులుకోవడం ఆశ్చర్యమే. మొన్నటివరకు ఈ పుకారును నిర్మాత నాగవంశీ ఖండించాడు. తను తీసిన మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, వీటిని పుకార్లుగా కొట్టిపారేశాడు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. శ్రీలీల తప్పుకుంది.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీలీల. అరడజనుకు పైగా సినిమాలున్నాయి ఈమె చేతిలో. విజయ్ దేవరకొండ సినిమాను వదులుకోవడంలో ఆమె తప్పులేదు. ఈ హీరో, పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న ఫ్యామిలీ మేన్ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో శ్రీలీల కాల్షీట్లు వేస్ట్ అయ్యాయి. మళ్లీ కాల్షీట్లు కేటాయించే టైమ్ శ్రీలీలకు దొరకలేదు. అందుకే తప్పుకున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాని పూర్తి చేసిన తర్వాత, విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ లో చేరుతాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది తిరిగి ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ గా కనిపించనున్నాడు.

First Published:  28 Oct 2023 5:05 PM GMT
Next Story