Telugu Global
Cinema & Entertainment

SreeLeela - విజయ్ సరసన శ్రీలీల

SreeLeela opposite Vijay Deverakonda - విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనుంది శ్రీ లీల.

SreeLeela - విజయ్ సరసన శ్రీలీల
X

వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది శ్రీలీల. మొన్నటికిమొన్న పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటించబోతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్-శ్రీలీల ది ఫ్రెష్ కాంబినేషన్.

వరుసపెట్టి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనే సినిమాలకు కమిట్ అవుతోంది శ్రీలీల. ప్రస్తుతం ఆ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చేస్తోంది శ్రీలీల. అదే బ్యానర్ పై వస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కూడా దాదాపు సితార బ్యానర్ సినిమానే. ఇప్పుడీ సినిమాలకు తోడు విజయ్ దేవరకొండ మూవీని కూడా సైన్ చేసింది.

రీసెంట్ గా ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది శ్రీలీల. ఇప్పుడిలా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. బన్నీ, ప్రభాస్ లాంటి హీరోల సరసన కూడా నటిస్తే, ఆమె నంబర్ వన్ హీరోయిన్ అయిపోయినట్టే.

First Published:  2 March 2023 9:31 AM GMT
Next Story