Telugu Global
Cinema & Entertainment

SreeLeela - బాలకృష్ణతో చేతులు కలిపిన శ్రీలీల

SreeLeela - ఎట్టకేలకు బాలయ్య సినిమా సెట్స్ లో జాయిన్ అయింది శ్రీలీల. ఇందులో బాలయ్య కూతురిగా ఆమె కనిపించనుంది.

SreeLeela - బాలకృష్ణతో చేతులు కలిపిన శ్రీలీల
X

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా ఉన్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్.

ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నారు ఆడియన్స్. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది.

సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన తమన్, ఈ ప్రాజెక్టుకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

First Published:  10 March 2023 3:44 PM GMT
Next Story