Telugu Global
Cinema & Entertainment

Aadikeshava | ఆ లోటు భర్తీ చేసిన శ్రీలీల

Aadikeshava Movie - భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల డాన్స్ లేదని భావించిన ఆడియన్స్ కు, ఇప్పుడు ఓ సాంగ్ తో ఆ లోటు భర్తీ చేసింది శ్రీలీల.

Aadikeshava | ఆ లోటు భర్తీ చేసిన శ్రీలీల
X

శ్రీలీల అనగానే ఎవరికైనా డాన్స్ గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి కాస్త పక్కకొచ్చి, తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. భగవంత్ కేసరి సినిమాలో బరువైన పాత్ర పోషించింది. అందులో శ్రీలీల ఓకే కానీ, కథ ప్రకారం ఆమెతో స్టెప్పులు వేయించలేకపోయాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

ఇప్పుడా లోటు తీరింది. శ్రీలీల మరోసారి తన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. ఆదికేశవ సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ వీడియో రిలీజైంది. అది లిరికల్ వీడియోకు ఎక్కువ, వీడియో సాంగ్ కు తక్కువ అన్నట్టుంది. దాదాపు కీలకమైన డాన్స్ మూమెంట్స్ అన్నింటినీ అందులో చూపించారు.

ఆ సాంగ్ లో మరోసారి తన డాన్స్ తో ఆకట్టుకుంది శ్రీలీల. పాట వినసొంపుగా లేకపోయినా, అలా కళ్లప్పగించి చూస్తారు జనం. కారణం శ్రీలీల మెస్మరైజింగ్ స్టెప్స్. శ్రీలీల యాక్టింగ్ కోసం భగవంత్ కేసరి చూడండి, ఆమె డాన్స్ కోసం థియేటర్ నుంచి బయటకొచ్చి ఆదికేశవ లిరికల్ సాంగ్ చూడండి అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.

అలా భగవంత్ కేసరిలో మిస్సయిన ఎలిమెంట్ ను, ఆదికేశవ సాంగ్ తో అందుకున్నారు ఆడియన్స్. భగవంత్ కేసరిలో డాన్స్ లేదనే లోటును, ఆదికేశవ సాంగ్ సరైన టైమ్ లో భర్తీ చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శ్రీలీల పేరిట ఈ సాంగ్ లో లిరిక్స్ ఉండడం.

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమా వచ్చేనెల 10న థియేటర్లలోకి వస్తోంది. అంటే, శ్రీలీల నుంచి షార్ట్ గ్యాప్ లోనే మరో సినిమా రాబోతోందన్నమాట. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  26 Oct 2023 2:04 PM GMT
Next Story