Telugu Global
Cinema & Entertainment

Samajavaragamana - శ్రీవిష్ణు సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Sree Vishnu's Samajavaragamana - శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సామజవరగమన. ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ చేశారు.

Samajavaragamana - శ్రీవిష్ణు సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' తో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ బాగా క్లిక్ అయ్యాయి. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్.

తాజాగా మేకర్స్ ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీతో ముందుకు వచ్చారు. జూన్ 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సామజవరగమన నవ్వులు పూయించనుంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ అలరించింది.

గోపీ సుందర్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశాడు.

రాజరాజచోర తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు శ్రీవిష్ణు. మధ్యలో యాక్షన్ సినిమాలు కూడా ట్రై చేసి బోల్తా పడ్డాడు. దీంతో మరోసారి తనకు ఎంతో కలిసొచ్చిన జానర్ లోకి మారి సామజవరగమన సినిమా చేశాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు ఈ హీరో.

First Published:  13 Jun 2023 1:55 AM GMT
Next Story