Telugu Global
Cinema & Entertainment

Sree Vishnu’s Samajavaragamana Movie: శ్రీవిష్ణు సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Sree Vishnu’s Samajavaragamana Movie: శ్రీవిష్ణు కొత్త సినిమా సామజవరగమన. ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది.

Sree Vishnu’s Samajavaragamana Movie: శ్రీవిష్ణు సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

Sree Vishnu’s Samajavaragamana Movie: శ్రీవిష్ణు సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

శ్రీవిష్ణు హీరోగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. వేసవి కానుకగా మే 18న ప్రపంచవ్యాప్తంగా సామజవరగమన చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూల్ గా ఉంది. శ్రీవిష్ణు కుటుంబంలోని అందరు ఆడవాళ్లతో కలిసి కనిపించాడు.

సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. సామజవరగమన ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతోందనే విషయం గ్లింప్స్ చూస్తే అర్థమైంది.

భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీవిష్ణు కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం.

First Published:  23 March 2023 11:20 AM GMT
Next Story