Telugu Global
Cinema & Entertainment

Samajavaragamana - శ్రీవిష్ణు కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్

Sree Vishnu's Samajavaragamana - శ్రీవిష్ణు కొత్త సినిమాకు సామజవరగమన అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదొక కామెడీ చిత్రం.

Samajavaragamana - శ్రీవిష్ణు కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్
X

వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్.

వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా.. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్, హీరోను కట్టి పడేయడం చూడ్డానికి కొత్తగా ఉంది.

భాను బోగవరపు ఈ సినిమాకు కథను అందించగా, దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశాడు. గోపీసుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

First Published:  14 Feb 2023 5:52 PM GMT
Next Story