Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమా స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు

అల్లూరి సినిమాను రిలీజ్ చేసిన శ్రీవిష్ణు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి కంప్లీట్ కామెడీ జానర్ ఎత్తుకున్నాడు ఈ నటుడు.

కొత్త సినిమా స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు
X

సున్నితమైన కామెడీని పండించడంలో శ్రీవిష్ణు టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇక వివాహ భోజనంబు సినిమాతో తన కామెడీ టైమింగ్ ను చూపించాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఇప్పుడు వీళ్లిద్దరూ చేతులు కలిపారు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇది పక్కా కామెడీ మూవీ.

ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ కు ఇది మూడో సినిమా. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా మారేడుమిల్లి ప్రజానీకం, సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. శ్రీవిష్ణుతో చేయబోయే సినిమా మూడోది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ ప్రాజెక్టుకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తోంది.

పూర్తిగా ఫన్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పట్లానే నారా రోహిత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. శ్రీవిష్ణుపై తీసిన ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.

ఈ చిత్రానికి భాను భోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నాడు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Sep 2022 3:34 AM GMT
Next Story