Telugu Global
Cinema & Entertainment

మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమా కాదిది

మాస్ ఇమేజ్ కోసమే శ్రీవిష్ణు, అల్లూరి సినిమా చేశాడనే రూమర్ ఉంది. దీనిపై సదరు హీరో స్పందించాడు. ఏమంటున్నాడంటే...

మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమా కాదిది
X

అల్లూరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన వెంటనే హీరో శ్రీవిష్ణుపై ఓ రేంజ్ లో విమర్శలు చెలరేగాయి. వరుసపెట్టి కథనాలు వచ్చాయి. అతడు కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని, అందుకో పోలీస్ పాత్ర చేశాడని, ఫైట్లు చేస్తున్నాడని రాసుకొచ్చారు. ఈ విమర్శలపై శ్రీవిష్ణు స్పందించాడు.

మాస్ ఇమేజ్ కోసం అల్లూరి సినిమా చేయలేదంటున్నాడు శ్రీవిష్ణు. సినిమా చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమౌతుందని చెబుతున్నాడు. కంఫర్ట్ జోన్ లో ఉండడం తనకు ఇష్టం ఉండదని, అందుకే అన్ని ప్రయత్నాల్లో భాగంగా పోలీస్ గెటప్ కూడా వేశానని చెప్పుకొచ్చాడు.

"కంఫర్ట్ జోన్ లో ఉంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. సింపుల్ కథతో పక్కింటి అబ్బాయిలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ అవే సినిమాలు చేస్తూ ఉంటే బయటికి రాలేను. ఒక నటుడిగా విభిన్నమైన పాత్రలు చేయలేను. అందుకే కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అల్లూరి కూడా అలా చేసిందే. ఇందులో మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు నా నుండి రాబోతున్న మూడు సినిమాలు కూడా పూర్తిగా వైవిధ్యమైనవే. ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది."

తనకు అసలు మాస్ అప్పీల్ వద్దంటున్నాడు ఈ హీరో. కొత్త కథలు చెప్పడానికి తను ఇండస్ట్రీకి వచ్చానని, ఆ పనిలోనే ఉంటానని చెబుతున్నాడు. ఇక అల్లూరి విషయానికొస్తే, ఓ నిజాయితీ గత పోలీసు అధికారి 15 ఏళ్ల ప్రయాణమే అల్లూరి సినిమా అంటున్నాడు శ్రీవిష్ణు.

First Published:  21 Sep 2022 4:56 AM GMT
Next Story