Telugu Global
Cinema & Entertainment

Sree Vishnu - ప్రీక్వెల్ పక్కా చేసిన హీరో

Sree Vishnu - కాంతార హిట్ అయిన తర్వాత దానికి ప్రీక్వెల్ రెడీ అవుతోంది. అదే టైపులో రాజరాజచోర సినిమాకు కూడా ప్రీక్వెల్ ప్రకటించాడు హీరో.

Sree Vishnu - ప్రీక్వెల్ పక్కా చేసిన హీరో
X

శ్రీవిష్ణు కెరీర్ లో రీసెంట్ హిట్ ఏదైనా ఉందంటే అది రాజరాజచోర మాత్రమే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు ఈ హీరో. అర్జున ఫల్గుణతో పాటు వరుసగా ఫ్లాపులిచ్చాడు. తాజాగా సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు.

సూపర్ హిట్టయిన రాజరాజచోర సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడట శ్రీవిష్ణు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు హసిత్ గోలి. ఆ తర్వాత మరో సినిమాకు అతడు కమిట్ అవ్వలేదు. దీనికి కారణం ప్రీక్వెల్.

రాజరాజచోర ప్రీక్వెల్ దాదాపు రెడీ అయిందని తెలుస్తోంది. దీనికోసం శ్రీవిష్ణు మేకోవర్ కూడా అవుతున్నాడట. తాజాగా మీసాలు తీసేసి కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు. రాజరాజచోర ప్రీక్వెల్ కోసమే ఈ మేకోవర్ అని తెలుస్తోంది.

అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి.

First Published:  29 Jun 2023 4:35 AM GMT
Next Story