Telugu Global
Cinema & Entertainment

Ramabanam - శ్రీలీల చేతుల మీదుగా గోపీచంద్ సాంగ్

Sree Leela Ramabanam - గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా రామబాణం. ఈ సినిమా మూడో పాటను శ్రీలీల రిలీజ్ చేసింది.

Ramabanam - శ్రీలీల చేతుల మీదుగా గోపీచంద్ సాంగ్
X

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'రామబాణం'. ఈ సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేశారు వీళ్లు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది.

ఈ రోజు ముచ్చటగా మూడో సింగిల్ రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రీలీల 'రామబాణం' థర్డ్ సింగిల్ లిరికల్‌ వీడియోని లాంచ్ చేసింది. మిక్కీ జె మేయర్ ఈ పాటని మెస్మరైజింగ్ ట్రాక్ గా కంపోజ్ చేశాడు. ఇటు మెలోడి అటు బీట్ రెండిటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ... ఈ పాటని స్వరపరిచారు.

తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపించే పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. రితేష్ జి రావు వాయిస్ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చింది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్, డింపుల్ హయాతి అందంగా కనిపించారు. దినేష్ కుమార్ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.



First Published:  24 April 2023 4:41 PM GMT
Next Story