Telugu Global
Cinema & Entertainment

మరో బంపరాఫర్ కొట్టేసిన శ్రీలీల

హీరోయిన్ శ్రీలీల మరో బంపరాఫర్ కొట్టేసింది. త్వరలోనే ఆమె రామ్ సరసన నటించనుంది.

మరో బంపరాఫర్ కొట్టేసిన శ్రీలీల
X

పెళ్లిసందD సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అవన్నీ త్వరలోనే వరుసపెట్టి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పుడీ సినిమాలతో పాటు మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ.

రామ్, బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాలో శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య స్క్రీన్‌పై కెమిస్ట్రీ అదిరిపోతుందని రామ్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇదొక్కటే కాదు మరో క్రేజీ అప్‌డేట్‌ కూడా వచ్చింది. రామ్‌-బోయపాటి సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందించబోతున్నాడు. ఇంతకుముందు బోయపాటి-తమన్ కాంబోలో వచ్చిన అఖండలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఆ మేజిక్ ఈ సినిమాతో కూడా రిపీట్ కాబోతోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ మేరకు సెట్ వర్క్ పూర్తి చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రీలీల, పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయింది. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ధమాకా అనే సినిమా చేస్తోంది. ఇక నవీన్ పొలిసెట్టి, వైష్ణవ్ తేజ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

First Published:  6 Oct 2022 4:17 AM GMT
Next Story