Telugu Global
Cinema & Entertainment

Pindam | పిండం.. ఓ భయానక హారర్ చిత్రం

Pindam Movie | తెలుగులో చాలా హారర్ సినిమాలొచ్చాయి. కానీ పిండం లాంటి భయంకరమైన హారర్ సినిమా రాలేదంటున్నారు మేకర్స్.

Pindam | పిండం.. ఓ భయానక హారర్ చిత్రం
X

శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న సినిమా ‘పిండం‘. సాయికిరణ్ దైదా ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించి యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతోందని చిత్ర దర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతూ, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని అన్నాడు. "ది స్కేరియస్ట్ ఫిల్మ్" అనేది ఉప శీర్షిక. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే, దర్శకుడు చెప్పేది నిజమే అనిపిస్తుంది.

దీపపు లాంతర్లు వెలుగులో హీరో శ్రీరామ్, నాయిక ఖుషి రవి,ఈశ్వరీ రావు తదితరులు ఓ బల్లపై పడుకున్న పాప చుట్టూ ఉండటం, ఓ వ్యక్తి చేతిలో పుస్తకం, వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఏదో ప్రమాదం గురించి కనిపిస్తున్న ఆందోళన, ఇవన్నీ భయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కాలం, 1990, 1930 లలో... మూడు కాలక్రమాలలో జరిగే కథగా పిండం సినిమాను చూపించబోతున్నారు.

ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 30న విడుదల చేయనున్నారు. నవంబర్ నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.

శ్రీరామ్, ఖుషి రవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

First Published:  20 Oct 2023 4:58 PM GMT
Next Story