Telugu Global
Cinema & Entertainment

Project K - ప్రాజెక్ట్-కె నుంచి మరో స్పెషల్ వీడియో

Project K - ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజైంది.

Project K - ప్రాజెక్ట్-కె నుంచి మరో స్పెషల్ వీడియో
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్ మూవీ ఇది. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రచారం చేస్తోంది యూనిట్. అందులో భాగంగా "ఫ్రమ్ స్క్రాచ్" పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనుల వీడియోను విడుదల చేస్తున్నారు.

ఎపిసోడ్-1 ప్రత్యేకంగా రూపొందించిన చక్రం తయారీని చూపించింది. తాజాగా ఎపిసోడ్ 2- అసెంబ్లింగ్ ది రైడర్స్‌ని విడుదల చేశారు. రైడర్స్ ఎవరు? చర్చల తరువాత అది విలన్ ఆర్మీ యూనిఫాం అని అర్థం అవుతుంది. ఇది సినిమాలో అత్యంత కాస్ట్ లీ పార్ట్ అని నిర్మాతలు తెలిపారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌ లో ఉండబోతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కు ఇది గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రాజెక్ట్ K.



First Published:  11 April 2023 3:16 PM GMT
Next Story