Telugu Global
Cinema & Entertainment

Raviteja | మిస్టర్ బచ్చన్ స్పెషల్ లుక్

Raviteja - ఈ రోజు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Raviteja | మిస్టర్ బచ్చన్ స్పెషల్ లుక్
X

గణతంత్ర దినోత్సవం రోజునే మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కూడా పడింది. ఈ ప్రత్యేక సందర్భంలో రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి ప్రత్యేకమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజను వింటేజ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.

ఈ పోస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లో గూండాలు నేలపై పడిఉండడం మనం చూడొచ్చు. రవితేజ బ్లూ షర్ట్, బ్యాగీ ప్యాంట్‌లో కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో వింటేజ్ కార్లు, ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం రవితేజతో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్ కారంపూడిలో జరుగుతోంది.

నామ్ తో సునా హోగా అనే ట్యాగ్‌లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.




First Published:  26 Jan 2024 3:51 PM GMT
Next Story