Telugu Global
Cinema & Entertainment

Mem Famous - స్టూడెంట్స్ కు స్పెషల్ డిస్కౌంట్

Mem Famous Movie - మేమ్ ఫేమస్ యూనిస్ మరో వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా కోసం, స్టూడెంట్స్ కు డిస్కౌంట్ ఇచ్చింది.

Mem Famous - స్టూడెంట్స్ కు స్పెషల్ డిస్కౌంట్
X

యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా మేమ్ ఫేమస్. అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా గత వారం రిలీజైంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ ఉన్నప్పటికీ, యూత్ కు బాగా కనెక్ట్ అయిందని చెబుతోంది యూనిట్. ఈ సందర్భంగా యూత్ కు ఓ డిస్కౌంట్ కూడా ఇచ్చారు.

ఇకపై ఏ కాలేజీ స్టూడెంట్ అయినా మేమ్ ఫేమస్ సినిమాను 99 రూపాయలకే చూడొచ్చు. బాక్సాఫీస్ వద్ద తమ కాలేజీ ఐడీ కార్డ్ చూపించి, 99 రూపాయలకే టికెట్ తీసుకొని సినిమా చూడొచ్చు. ఈ ఆఫర్ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. అయితే ఇది కొన్ని థియేటర్లలో మాత్రమే.

ఇక ఈ సినిమాపై నడుస్తున్న నెగెటివ్ టాక్ పై మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. సినిమాను, యూత్ ను తొక్కేయొద్దని అంటున్నాడు నిర్మాత శరత్. అవసరమైతే లైవ్ డిబేట్ పెడదామంటున్నాడు.

"మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగాలేకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు చూస్తున్నారు. మా జీవితంలో మేము ఏం చేయాలని అలోచించాం తప్ప పక్కొడిని ఎట్లా తొక్కేయాలని ఆలోచించలేదు. ఇది మాకే కాదు ఇండస్ట్రీలో నిర్మాత దర్శకుడు హీరో ప్రతి ఒక్కరు ఎదుర్కొని ఉంటారు. చాలాసార్లు దీని గురించి మాట్లాడాలని అనుకున్నాం. కానీ ఈ రోజు 22 ఏళ్ల పిల్లలకి ఇలా జరుగుతుంటే చాలా బాధ అనిపించి దీనిని అడ్రస్ చేస్తున్నాం. సినిమా గురించి మీకు ఏదైనా అనిపిస్తే ఒక ప్లేస్ అనుకుందాం. లైవ్ పెడదాం. క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతేగాని అసభ్యంగా మాట్లాడటం మాత్రం చేయకండి. దాని ద్వారా చాలా మంది బాధపడతారు. సోషల్ మీడియాని పాజిటివ్ గా వాడుకోవాలి. నెగిటివ్ గా వాడితే దాని వలన నష్టం తప్పితే లాభం లేదు. మీకు నచ్చకపొతే ట్విట్టర్ లో చెప్పండి.మీతో కలిసి సినిమా చూసి చర్చించుకుందాం."

ఇలా తన ఆవేదనను వ్యక్తం చేశాడు శరత్. తమకున్న పలుకుబడితో చాయ్ బిస్కెట్ నిర్మాతలు... మహేష్ బాబు, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి హీరోలతో ఈ చిన్న సినిమాకు ప్రచారం చేయించుకోగలిగారు.

First Published:  30 May 2023 11:52 AM GMT
Next Story