Telugu Global
Cinema & Entertainment

Game Changer | గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేస్తోంది

Game Changer - దీపావళికి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి సాంగ్ రాబోతోంది. తమన్ దీనికి కంపోజర్.

Game Changer | గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేస్తోంది
X

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. భారీ బ‌డ్జెట్‌తో దిల్ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.

అలా లీక్ అయిన సాంగ్ ను దీపావ‌ళి సంద‌ర్బంగా విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  9 Nov 2023 12:59 AM GMT
Next Story