Telugu Global
Cinema & Entertainment

తుపాకీ తనకు కొత్త కాదంటున్న హీరోయిన్

ది ఘోస్ట్ తన కెరీర్ కు చాలా కీలకం అంటోంది హీరోయిన్ సోనాల్ చౌహాన్. తను గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా, యాక్షన్ రోల్స్ కూడా చేయగలనని చెబుతోంది.

తుపాకీ తనకు కొత్త కాదంటున్న హీరోయిన్
X

నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా ఇందులో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహాన్, మీడియా ముందుకొచ్చింది. తెలుగులో తొలి యాక్షన్ థ్రిల్లర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చేసింది యాక్షన్ మూవీ అయినప్పటికీ తనకు తుపాకీలు కొత్తకాదంటోంది. నిజజీవితంలో తుపాకీ చూశానని చెబుతోంది.

"తుపాకీ నాకు కొత్త కాదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం ఉంది. అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద ఆయుధాల్ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు 2 నెలలు పైగా శిక్షణపొందాను. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాను."

ఇలా తనకు తుపాకులు కొత్తకాదనే విషయాన్ని బయటపెట్టింది సోనాల్. ఘోస్ట్ సినిమాలో 2 యాక్షన్ సీక్వెన్సుల్లో పైట్ చేసిందట సోనాల్. వాటి రిహార్సల్స్ టైమ్ లో తన కాలి బొటనవేలు బెణికిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్సులు చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతోంది.

ఈరోజు ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కర్నూలులో గ్రాండ్ గా జరగనుంది. సోనాల్ కూడా ఈ ఫంక్షన్ కు ఎటెంట్ అవుతోంది. యూనిట్ తో పాటు నాగచైతన్య, అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

First Published:  25 Sep 2022 10:01 AM GMT
Next Story