Telugu Global
Cinema & Entertainment

Skanda | మాస్ జాతరకు సిద్ధం

Skanda Release trailer - రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా స్కంద. ఈ సినిమా నుంచి మరో ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Skanda | మాస్ జాతరకు సిద్ధం
X

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి చేస్తున్న యాక్షన్ మూవీ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తమన్ సంగీతం అందించాడు. స్కంద టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ కరీంనగర్ లో స్కంద కల్ట్ జాతర ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

కల్ట్ జాతర ఈవెంట్ లో స్కంద రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. రామ్ యాక్షన్, బోయపాటి హై-వోల్టేజ్ ఇంటెన్స్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రిలీజ్ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. ''నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను'' అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి.

మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. సంతోష్ డిటాకే కెమెరా పనితనం బాగుంది. మొత్తంగా రిలీజ్ ట్రైలర్, స్కంద పై అంచనాలని మరింతగా పెంచింది.

కల్ట్ జాతర ఈవెంట్ లో రామ్ పోతినేని మాట్లాడుతూ.. "ఇదివరకే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్పెషల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్ నిర్వహించడం ఆనందంగా ఉంది. బోయపాటి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. అయితే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద సినిమాలో కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.

భారీగా జరిగిన ఈ ఈవెంట్ కు శ్రీలీల హాజరుకాలేకపోయింది. మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ మాత్రం వచ్చింది. బోయపాటి, నటుడు ప్రిన్స్ తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

First Published:  26 Sep 2023 4:49 AM GMT
Next Story