Telugu Global
Cinema & Entertainment

Skanda Movie | కొత్త రిలీజ్ డేట్, సరికొత్త పోస్టర్

Skanda Movie - రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ మూవీకి కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Skanda Movie | కొత్త రిలీజ్ డేట్, సరికొత్త పోస్టర్
X

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది. స్కంద సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

స్కంద గురువారం విడుదల కానుంది కాబట్టి లాంగ్ వీకెండ్, ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ కానుంది. ఆ వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం గాంధీ జయంతి పడింది. ఆ రోజు కూడా శెలవు. అదే టైమ్ లో దసరా శెలవులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలా స్కంద సినిమాకు మంచి వీకెండ్ దొరికింది.

ఇక పోస్టర్ విషయానికొస్తే.. రిలీజ్ డేట్ పోస్టర్‌ లో రామ్, శ్రీలీల అందంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల గాగ్రా చోళీలో అందంగా ఉంది.

ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక క్రేజ్‌ మరింత పెరిగింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించగా, సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

First Published:  7 Sep 2023 4:13 AM GMT
Next Story