Telugu Global
Cinema & Entertainment

Skanda | ఓవర్సీస్ లో క్లిక్ అయిన స్కంద

Skanda - రామ్ హీరోగా నటించిన సినిమా స్కంద. ఇక్కడ ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో మాత్రం హిట్టయింది.

Skanda | ఓవర్సీస్ లో క్లిక్ అయిన స్కంద
X

రామ్ పోతినేని.. టాలీవుడ్ టైర్-2 హీరోల్లో టాప్ లో ఉంటాడు. ఇతడికంటూ సెపరేట్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. కెరీర్ లో మంచి విజయాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకున్న రామ్, ఓవర్సీస్ లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు. అతడు సినిమాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు సాధించిన దాఖలాల్లేవు.

అమెరికాలో రామ్ పోతినేని సినిమా ఏదీ ఇప్పటివరకు మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరలేదు. కనుక ఇది అతని బలహీనమైన మార్కెట్. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్‌లో అతని బిగ్గెస్ట్ హిట్ నేను శైలజ మాత్రమే.. ఇన్నాళ్లకు ఆ లోటు తీరింది.

రామ్ నటించిన మాస్ చిత్రం “స్కంద”, యునైటెడ్ స్టేట్స్‌లో మెరుగ్గా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు రెండున్నర లక్షల డాలర్లు వచ్చాయి. శని, ఆదివారాలు ఉండనే ఉన్నాయి. సో.. ఈ సినిమాకు మంచి కలెక్షన్ ఆశిస్తున్నారు. మొదటి వారాంతం ముగిసేసరికి, 4 లక్షల డాలర్లను ఈజీగా అధిగమించనుంది.

"ది వారియర్," "ఇస్మార్ట్ శంకర్", "హలో గురు ప్రేమకోసమే" అనే ఈ చిత్రాలేవీ యునైటెడ్ స్టేట్స్‌లో వాటి మొత్తం రన్‌లో 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేయలేదు. ఇన్నాళ్లకు స్కంద రూపంలో ఓవర్సీస్ లో రామ్ కు మార్కెట్ క్రియేట్ అవ్వబోతోంది.

First Published:  1 Oct 2023 3:23 PM GMT
Next Story