Telugu Global
Cinema & Entertainment

SJ Surya | మరో సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య

SJ Surya Sardar 2 - ఎస్ జే సూర్య మరో క్రేజీ మూవీలోకి ఎంటరయ్యాడు. సర్దార్-2లో విలన్ అతడే.

SJ Surya | మరో సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య
X

హీరో కార్తి 'సర్దార్' సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్టర్ ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కార్తీ, ఎస్ జె సూర్య లని స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మొదటి సినిమా పెద్ద హిట్టవ్వడంతో, రెండో సినిమాకు భారీగా బడ్జెట్ పెంచారు.

సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

First Published:  16 July 2024 4:39 PM GMT
Next Story