Telugu Global
Cinema & Entertainment

Sithara Entertainments | పంపిణీ రంగంలోకి మరో నిర్మాణ సంస్థ

Sithara Entertainments | వరుస సినిమాలతో బిజీగా ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ, పంపిణీ రంగంలోకి ఎంటరైంది. తొలి సినిమాగా లియోను ఎంపిక చేసుకుంది.

Sithara Entertainments | పంపిణీ రంగంలోకి మరో నిర్మాణ సంస్థ
X

ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ లోకి ఎంటరయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్, గీతాఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్వీసీ.. ఇలా చాలా నిర్మాణ సంస్థలు పంపిణీలో తమ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో ప్రొడక్షన్ కంపెనీ చేరింది.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడీ సంస్థ.. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న 'లియో'లో భాగస్వాములు కాబోతున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి ప్రముఖ దర్శకులు కూడా నటిస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, జాఫర్ సాదిక్, మడోన్నా సెబాస్టియన్, అనురాగ్ కశ్యప్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

ఇటీవలే చిత్ర బృందం షూటింగ్‌ను పూర్తి చేసింది. దాదాపు 125 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో ప్రధానంగా చిత్రీకరించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదలవుతోంది.

ఇలాంటి ప్రతిష్టాత్మక లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించింది. దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.

First Published:  20 July 2023 8:48 AM GMT
Next Story