Telugu Global
Cinema & Entertainment

Intinti Ramayanam: ఓటీటీలోకి ఎంటరైన 'సితార'

Sithara Entertainments: తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇప్పుడు ఓటీటీలోకి ఎంటరైంది. ఆహా కోసం ఓ సినిమా సిద్ధం చేసింది.

Intinti Ramayanam: ఓటీటీలోకి ఎంటరైన సితార
X

సితార ఎంటర్ టైన్ మెంట్స్.. టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటి. భీమ్లానాయక్ లాంటి పెద్ద సినిమా తీసిన బ్యానర్ ఇది. ఇప్పుడీ బ్యానర్ ఓటీటీలోకి ఎంటరైంది. కేవలం ఓటీటీ కోసం ఓ సినిమా తీసింది.

ఆహాలో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. ఇందులో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి వంటి వారు నటించారు. సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశిస్తోంది.

మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్‌) కుటుంబం ఓ సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

First Published:  23 Nov 2022 4:17 AM GMT
Next Story