Telugu Global
Cinema & Entertainment

మిలియన్ మార్క్ దిశగా సీతారామం

లోకల్ గా సీతారామం కంటే బింబిసార పెద్ద హిట్. ఓవర్సీస్ లో మాత్రం సీతారామం సినిమాదే డామినేషన్. ప్రస్తుతం ఆ సినిమా మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

Sita Ramam Movie
X

యూఎస్‌ మార్కెట్‌లో 'సీతా రామం' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డేస్ లో కూడా సినిమా పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా నడిచింది. ఓవరాల్ గా 8 లక్షల డాలర్ల వసూళ్లతో ఈ సినిమా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా మిలియన్ మార్క్ అందుకోబోతోంది.

ఓవర్సీస్ లో మొదటి వారాంతానికి సీతారాం సినిమాకు 9లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. అయితే మిలియన్ డాలర్ మార్క్ చేరడం అంత ఈజీ కాదు. ఓవర్సీస్ లో సాధారణ రోజుల్లో ఆక్యుపెన్సీ ఉండదు. పైగా రెండో వారానికి అస్సలు ఉండదు. సో.. ఈ సినిమా మిలియన్ మార్క్ అందుకోవాలంటే మరో వీకెండ్ రావాల్సిందే.

ఈ వీకెండ్ మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాలొస్తున్నాయి. ఆ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ సీతారామం సినిమా మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమని భావిస్తోంది ట్రేడ్.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషించింది. సుమంత్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వనీదత్, స్వప్నా దత్ నిర్మించారు. ఇటు దేశీయ మార్కెట్‌లోనూ 'సీతారామం' సూపర్ హిట్ అయింది.

First Published:  11 Aug 2022 10:20 AM GMT
Next Story