Telugu Global
Cinema & Entertainment

Sitara Ghattamaneni - సోలో యాడ్ ఆఫర్ అందుకున్న సితార

Sitara Ghattamaneni gets solo Add - మహేష్ బాబు కూతురు ఓ ప్రముఖ బ్రాండ్ కు సోలో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది.

Sitara Ghattamaneni - సోలో యాడ్ ఆఫర్ అందుకున్న సితార
X

స్టార్ కిడ్ సితార ఘట్టమనేని.. సూపర్ స్టార్ మహేష్, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ల కుమార్తె. ఈ చిన్నారికి యాడ్స్ కొత్తకాదు. ఇప్పటికే తల్లితండ్రితో కలిసి కొన్ని యాడ్స్ చేసింది. ఇప్పుడు సోలోగా ఓ యాడ్ కు ఎంపికైంది సితార. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీ కాంట్రాక్ట్‌ను కైవసం చేసుకుంది. ఇంత పెద్ద కాంట్రాక్ట్‌ను పొందిన భారతదేశపు మొదటి స్టార్ కిడ్ సితార. అంతేకాదు, ఈ యాడ్ కోసం సితార భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటోందంట.

ఈ ప్రకటనను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఎలాంటి లీక్స్ జరగకుండా ఉండేందుకు.. 3 రోజుల పాటు సీక్రెట్ గా ఈ యాడ్ తీశారు. ఈ యాడ్ లో టాప్ టెక్నీషియన్స్, సిబ్బంది పాల్గొన్నారు.

సితార ఇలా సోలోగా ఓ యాడ్ దక్కించుకోవడంతో మహేష్-నమ్రత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. త్వరలోనే ఈ యాడ్ అన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ఇంటర్వెల్ టైమ్ లో ప్రసారం చేయబోతున్నారు.

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది సితార. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తనకు నచ్చిన పని చేసేందుకు మహేష్-నమ్రత కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సితార తన క్రియేటివిటీ మొత్తం చూపిస్తుంటుంది.

ఆమె ఇప్పటికే మహేష్ బాబు సినిమాలోని ఓ పాటకు డాన్స్ చేసింది. ఇప్పుడీ యాడ్ తో సితార క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

First Published:  26 May 2023 11:47 AM GMT
Next Story