Telugu Global
Cinema & Entertainment

సార్ మూవీ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా సార్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

సార్ మూవీ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!
X

ధనుష్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం సార్. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు, విద్యా వ్యవస్థలో లోపాల్ని ఎత్తిచూపుతూ ఈ సినిమా తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.

'సార్' టీజర్ లో యాక్షన్, ఎమోషన్ లను మిక్స్ చేశారు. "విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యం తో సమానం. పంచండి ...

ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి" అంటాడు హీరో ధనుష్ చెప్పే డైలాగ్ టోటల్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

విద్యావ్యవస్థ తీరుతెన్నుల మీదుగా సాగే ప్రయాణం, అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 69 సెకెన్ల ఈ టీజర్ 'సార్' పై అంచనాలు పెంచింది. తెలుగు, తమిళ భాషల్లో 'సార్' అక్టోబర్ లో విడుదలకానుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ 'సార్' ను ప్రజెంట్ చేస్తోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు.


First Published:  28 July 2022 2:37 PM GMT
Next Story