Telugu Global
Cinema & Entertainment

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు-తమిళ భాషల్లో ధనుష్ చేస్తున్న సినిమా సర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది.

ధనుష్ సార్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

హీరో ధనుష్ తో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ మూవీ 'సార్'. తమిళంలో ఈ సినిమాకు వాతి అనే టైటిల్ పెట్టారు. షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ , శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవల"యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్" స్లోగన్ తో ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ రివీల్ చేశారు. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ జోష్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ హీరో ధనుష్ పుట్టినరోజు (జూలై 28)ను పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ 'సార్' తొలి ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.

ఈ ప్రచార చిత్రంలో ధనుష్ 'సార్' ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, దేనికి సిద్ధమవుతున్నాడు లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే 'సార్' మూవీ.

ఈ ప్రచార చిత్రంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక రేపు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.





First Published:  27 July 2022 8:28 AM GMT
Next Story