Telugu Global
Cinema & Entertainment

18 Pages: శింబు పాటను రిలీజ్ చేసిన యూనిట్

Simbu 18 pages: నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 18-పేజెస్. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడాడు. ఆ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు.

18 Pages: శింబు పాటను రిలీజ్ చేసిన యూనిట్
X

శింబు మరో తెలుగు పాట పాడాడు. 18-పేజెస్ సినిమాలోనిది ఈ పాట. తాజాగా ఆ పాట రిలీజా చేశారు. గోపీసుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను శింబు పాడగా, ట్రెండీగా అనిపించింది.

"టైమ్ ఇవ్వు పిల్ల కొంటెం టైమ్ ఇవ్వు" అనే లిరిక్స్ సాగే ఈ పాట వినగానే ఆకట్టుకుంటోంది. ఈ లిరిక్స్ కు హీరో నిఖిల్ వేసిన సిగ్నేచర్ స్టెప్ ను కూడా రిలీజ్ చేయడం ఎట్రాక్ట్ చేసింది.

"ఈ జనరేషన్ పిల్లగాన్ని కాన నేను, నీలాగ మూవ్ అన్ ఎందుకు అవ్వలేను".. "మన పాస్ట్ అసలు గురుతే రాదా, నీకు కొంచెమైనా గిల్టీ లేదా" లాంటి లైన్లు యూత్ ను ఎట్రాక్ట్ చేశాడు రాశాడు గేయ రచయిత శ్రీమణి.

రీసెంట్ గా వారియర్ మూవీలో బుల్లెట్ సాంగ్ పాట పాడాడు శింబు. అది పెద్ద హిట్టయింది. ఇప్పుడు 18-పేజెస్ లో సాంగ్ తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు.


First Published:  6 Dec 2022 5:30 AM GMT
Next Story