Telugu Global
Cinema & Entertainment

Tillu Square | కాసుల వర్షం కురిపిస్తున్న టిల్లూ

Tillu Square - టిల్లూ స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. బాక్సాఫీస్ బరిలో కాసుల వర్షం కురిపిస్తోంది.

Tillu Square | కాసుల వర్షం కురిపిస్తున్న టిల్లూ
X

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ జాక్‌పాట్ కొట్టింది. డిజె టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్నిసితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించారు. సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా మొదటి వీకెండ్ తర్వాత ఏకంగా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఇప్పుడు అధికారికంగా 40 కోట్ల షేర్ క్లబ్‌లో చేరింది. భారీ హైప్‌ తో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుంది. మిడ్-టైర్ రేంజ్ హీరోలకు ఇది భారీ టార్గెట్. తాజా వసూళ్లతో ఇది 85 కోట్ల రూపాయల గ్రాస్ కు చేరింది. వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే దిశగా దూసుకుపోతోంది టిల్లూ స్క్రేర్. ఇది ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ మార్క్ దాటేసింది. త్వరలోనే 2.5 మిలియన్ మార్క్ అందుకోబోతోంది. ఇది కూడా పెద్ద రికార్డ్.

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఈ వీకెండ్ విడుదలవుతోంది. ఫ్యామిలీ స్టార్ హిట్టయితే టిల్లూ జోరు తగ్గే సూచనలున్నాయి. ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా టిల్లూను ఆపడం ఎవ్వరితరం కాదు.

ఈరోజు లేదా రేపట్లోగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ లోకి అడుగుపెడుతోంది. మిడ్ రేంజ్ హీరోల్లో అత్యంత వేగంగా వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డ్ సృష్టించాడు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఈ సినిమాను ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కూడా చూసి మెచ్చుకున్నారు.

First Published:  4 April 2024 2:04 AM GMT
Next Story