Telugu Global
Cinema & Entertainment

Siddhu Jonnalagadda: కొత్త సినిమా ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ

Siddhu Jonnalagadda - ప్రస్తుతం టిల్లూ స్క్వేర్ అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో పాటు ఇప్పుడు మరో సినిమా ఎనౌన్స్ చేశాడు.

Siddhu Jonnalagadda: కొత్త సినిమా ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ
X

యాక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన డీజే టిల్లు సినిమా జనాలకు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయిందో స్పెషల్‌గా మెన్షన్‌ చేయక్కర్లేదు. ప్యాండమిక్‌ తర్వాత టాలీవుడ్‌లో ఓ ఊపు తెచ్చిన సినిమాల్లో స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది డీజే టిల్లుకి.

సినిమాల సెలక్షన్‌ విషయంలో సిద్ధు జొన్నలగడ్డ చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. అలాంటి సిద్ధు ఇప్పుడు ఓ కథను లాక్‌ చేశాడు. తన 31వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటించాడు సిద్ధు జొన్నలగడ్డ.

సిద్ధు జొన్నలగడ్డ నటించే 8వ సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్‌ టిల్లు స్క్ర్వేర్ లో నటిస్తున్నాడు. లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలవుతుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

First Published:  8 Feb 2023 4:01 AM GMT
Next Story